Sunday, February 16, 2020

నీ ఆత్మ నిశ్చలమైతే,

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥

పూలకు రంగులు ఉన్నవి కాని, పూజకు రంగులు ఉన్నాయా?
పూల వంటిదే నీ ఆత్మా
పూజ వంటిదే పరమాత్మ      ॥ నీ ఆత్మా ॥

ఆవుకు రంగులు ఉన్నవి కాని, పాలకు రంగులు ఉన్నాయా ?
ఆవువంటిదే నీ ఆత్మా,
పాల వంటిదే పరమాత్మ       ॥ నీ ఆత్మా ॥

ఏటికి వంపులు ఉన్నవి కాని, నీటికి వంపులు ఉన్నాయా ?
ఏటి వంటిది నీ ఆత్మా ,
నీటి వంటిదే పరమాత్మా       ॥ నీ ఆత్మా ॥

భజనకు రీతులు ఉన్నవి కానీ, భక్తి కి రీతులు ఉన్నాయా?
భజన్ వంటిదే నీ ఆత్మా
భక్తి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

చెరుకు కణతలు ఉన్నవి కానీ, తీపికి కణతలు ఉన్నాయా?
చెరుకు వంటిదే నీ ఆత్మా
తీపి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥



Tuesday, May 29, 2018

బంధాలన్ని పెరిగి భాద్యతలైనప్పుడే జీవితం ఒంటరిది


ఎంతో పెద్ద బలగం నా, నా బార్యామణి తరుపునా ఎందరో వున్నారు చుట్టాలు స్నేహితులు. ఇంటికి ఇంటికి, ఉరికి ఊరికి పెద్దదూరం ఏం కాదు, కప్పు కాఫీ తాగేసమయం లేకచంద్రుడు వెళ్ళి సుర్యాడువచ్చేసమయం, ఇళ్ళు విశాలం, ఊరు విశాలం, మనసు విశాలం కాని మనుషులకి మనషులకే ఇరుకు, మనషి జీవితం అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అనే అనదం ప్రేమ తప్ప ఏమి తెలియని కుటుంబం. ఆ ప్రేమ బంధాలన్ని పెరిగి భాద్యతలైనప్పుడు, అవి పంచుకోలేక వాటిని మోయలేక పడే నరకయాతనే నేన్ను ఒంటరి తనాన్ని దెగ్గర చేస్తుంది. ఒంటరితనం అంటే మనిషి లోని కోపం, చిరాకు, ఆవేశం, అనర్థం, అపార్థం, అభిప్రాయభేదం వల్ల వచ్చే గొడవలు నీలోని స్థిమితన్ని దూరం చేసి మతిస్తిమితాలుగా మార్చేస్తుంది, సున్నా కి వెలువ లేదు, అదే సున్నా లేనిది రూపాయికి విలువలేదు, ప్రేమ లెక్క కూడా అంతే ఉదయం లేచిన దేగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు లెక్కలే జీవితం, ఇంకా ప్రేమ పంపకాలకి చోటెక్కడిది. రాత్రికి ఉదయానికి మధ్య తీరిక చేసుకొని ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకు పుడతామో.. ఎవరి కోసం బ్రతుకుతామో..తెలియక అందరు ఉన్నా..జీవితం ఒక్కోసారి ఒంటరిది అవుతుంది.

Wednesday, January 17, 2018

పాలకులు ఏవరు పాలించేడిది ఎవరు.!
సంపాదకులు ఏవరు సంపదించేడిది ఏవరు.!!
అనుబవజ్ఞాలు ఏవరు అనుబవించేది ఏవరు.!!!
అంతా మాయ, మాయే ఛాయా. జీవితమే మాయ ఛాయా,
జీవితన్ని నడిపించేది ప్రేమ కాదు, సంపాదన, పరిపాలన, అనుబవం.
                                                                  -- శ్రీనివాస్ ఇరుకుళ్ళ


Thursday, April 20, 2017

కురుక్షేత్ర సంగ్రామం

Image result for కురుక్షేత్ర సంగ్రామం
శ్రీ కృష్ణుడు : ఏంటి అర్జునా యుద్ధం మధ్యలో అపేసావు అన్నాడు.
అర్జునుడు : బావా నేను యుద్ధం చేయను అన్నాడు.
శ్రీ కృష్ణుడు : ఎం అన్నాడు,
అర్జునుడు : అటు ఎవరు భీష్ముడు మా తతాయ్యఇటు ఎవరు ద్రోణుడు మా సార్, అది ఎవరు దుర్యోధనుడు మా బ్రదర్ సో నో యుద్ధం అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఓర్యి చేసేది ఎవడు చేయించేది ఎవడు
అర్జునుడు : నో యుద్ధం బావా స్టాప్ అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఎం చేయాలో అర్ధం కాకా యుద్ధంనికి పాస్ బటన్ కొట్టాడు, దా అన్నాడు, కూర్చోబెట్టాడు, భగవద్గీత చెప్పడం మొదలు పెట్టాడు, 18 అధ్యాయముల భగవద్గీత, అద్బుతమైనటువంటి, కర్మ యోగము, జ్ఞాన యోగము, భక్తి యోగము, సాంఖ్య యోగము చెప్తూనే వున్నాడు. వింటున్నాడు
అర్జునుడు :  చాలా బాగుంది ఏంటి బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : జాతస్య ద్రోమరణం పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు
అర్జునుడు : ఏంటి బావా అన్నాడు
శ్రీ కృష్ణుడు : పుట్టిన ప్రతి ఒక్కడు మరణిస్తాడు నాయనా అన్నాడు. నాయనా మరణం శాశ్వతం, మరణం గురించి శోకింపజలదు, మరణము ఈ జన మరణ జీవములలో మరణము సర్వసాదారణము అన్నాడు.
అర్జునుడు : ఏంటి బావా అన్నాడు.
శ్రీ కృష్ణుడు : నాయనా మరణం కోసం బయపడకు, ఆత్రాయ గారు ఒక గొప్ప మాట అన్నారు, చావు అంటే నాకు భయం లేదు ఎందుకంటే అది ఎలా వుంటుందో నాకు తెలియదు అది వచ్చేటప్పుటికీ నేను ఏలాగు ఉండను అన్నాడు. ఇలాంటివి ఎన్నో మాటలు చెప్పాడు అర్జునుడి కి కృష్ణుడు అన్ని విన్నాడు. అర్డంయిందా అన్నాడు 18 అధ్యాయముల అయిపోయాయి.
అర్జునుడు : సుపర్ బావా చాలా అద్బుతంగా చెప్పావు అన్నాడుజీవితంలో వినలేదు బావా ఇలాంటి వాక్యాలు అని అన్నాడు. కానీ కొంచం కాన్ఫిజింగ్ గ వుంది బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఓకేనా అన్నాడు
అర్జునుడు : కానీ కొంచం కాన్ఫిజింగ్ గ వుంది బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : ఎం అన్నాడు
అర్జునుడు : అర్ధంఅయి అర్ధంకానట్టుగా వుంది బావా అన్నాడు,
శ్రీ కృష్ణుడు : విశ్వరూప దర్శనం చేసాడు, పద్నాలుగు లోకాలు చూపించాడు, నాయనా సర్వకాల సర్వస్థలఎందు సర్వలోకములు పద్నాలుగు భువనబండవములు నాలోనే వున్నాయి అన్నాడు జన మరణములు నాలోనే వున్నాయి ఎందుకంటే
కర్త కర్మ క్రియా నేనే
కర్తను మాత్రం నేను క్రియను మాత్రం నేను కర్మను మాత్రమే నీవుచేయవాలను అన్నాడు,
అర్జునుడు : ఏంటి బావా అన్నాడు
శ్రీ కృష్ణుడు : చూడు ఒకసారి సరిగ్గా అన్నాడు,
పద్నాలుగు లోకాలు చూపించాడు. ఏడూ ఊర్ద్వలోకాలు, ఏడూ అదోలోకాలు
సత్యలోకం, తపోలోకం, జనోలోకం, మహర్లోకం, స్వర్లోకం, భవర్లోకం, భూలోకం అను ఏడూ ఊర్ద్వలోకాలు
అతలం, వితలం, సుతలం, రసాతలం, మహాతలం, తలాతలం, పాతాళం అను ఏడూ అదోలోకాలు,
అర్జునుడు : సరే బావా సరే అన్నాడు వెళ్ళిపోదాం బావా యుద్ధం చేద్దాం బావ అన్నాడు,
శ్రీ కృష్ణుడు : తెల్లారి వెళ్దాం రా భగవద్గీత చెప్పడం ఇప్పుడే అయిపోయిందిగా అన్నాడు,
అర్జునుడు : నో ఇప్పుడే,
శ్రీ కృష్ణుడు : సూర్యాస్తమం అయిన తరువాత శత్రియధర్మం కాదు యుద్ధం చేయకోడదు అని అన్నాడు,
అర్జునుడు : నో ఇప్పుడే అన్నాడు,
తెల్లారి యుద్దానికి వెళ్లారు
కృష్ణుడు చాలా హ్యాపీ గ వున్నాడు నేను చెప్పిన భగవద్గీత అర్జునుడు బాగా వున్నాడు యుద్ధం బాగా చేస్తాడు అని.
యుద్ధం స్టార్ట్ అయిన గంటకి పద్మయుహంలోకి వెళ్ళిన అబిమన్యుడు చచ్చిపోయాడు.
అర్జునుడు : అబిమన్యుడు చచ్చిపోగానే అర్జునుడు కృష్ణుడుకి కూడా చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అబిమన్యుడు దెగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు, అబిమన్య చచ్చిపోయవ నాకు పుత్రశోకాన్ని మిగిల్చావ నీవు మరణించిన నేను ఎందుకు బ్రతికివుండాలి అని ఏడుస్తున్నాడు,
కృష్ణుడు : కృష్ణుడు వెనుకల వచ్చాడు నడుచుకుంటూ అర్జునుడు వెళ్ళిన గంటకి, అక్కడవున్న గోడకి కృష్ణుడు తలవేసి కొట్టేసుకుతున్నాడు,
భీష్ముడు : అక్కడికి భీష్ముడు వచ్చాడువాడికి అంటే కొడుకు చచ్చిపోయాడు అని ఏడుస్తున్నాడు, మరి ను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు.
కృష్ణుడు : వాడికి నెన్ననే 18 అధ్యాయములు భగవద్గీత చెప్పను అన్నాడు.


Wednesday, April 19, 2017

అది ఓ వరం  ఆ వరం నా ఇల్లాలి రూపంలో నాసొంతమైనది అ వరమే ప్రేమ ...! దాన్ని చూడాలంటే కానలేనిది
వినాలంటే ఆలపించాలేనిది
చదవాలంటే రాయలేనిది
వర్ణిచాలంటే బాషచాలనిది
కావాలంటే పొందలేనిది
దాయాలంటే దాచలేనిది
పొందలనుకున్నపుడు సొంతమైతే అది ఓ వరం

Monday, March 27, 2017

చదువు వలేసి ఉదయాన్నే
బాల్యాన్ని బుట్టలో వేసుకుంటూ స్కూళ్ళు..!
ఉదయాన్నే జనాలని మింగుతూ
నోళ్ళు తెరిచిన ఆఫీసులు..!!

Sunday, February 19, 2017

ఎందుకో ఏమో.... !

నేను ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఎందుకో అప్పటి వరకు అందంగా ఉన్న నా మనసు ఇంతలోనే బరువెక్కింది, కంట్లో నీరు మొదలయింది. ఎందుకు నాకు ఎం అర్థం కావడం లేదు....
ఇన్ని రోజులు ఉన్న నా ఆనందం దూరమవుతుందా అన్న బాధ..
అది నేను పెళ్లి పీటల మీద తాళి కట్టే ముందు..
నాకే ఇలా అనిపించిందా లేక అందరికి ఇలానే ఉంటుందా.?