Friday, October 16, 2026

అయ్యప్ప దీక్ష యోజన – భజన పాటలు పుస్తకం ॥ ఓం స్వామియే శరణం అయ్యప్ప ॥

అయ్యప్ప మాల ధరించిన స్వాములకు, భజన బృందాలకు, గురుస్వాములకు ఉపయోగపడేలా "అయ్యప్ప దీక్ష యోజన" అనే భజన పాటల పుస్తకాన్ని సంకలనం చేశాను. దీక్షా నియమాల నుంచి పడిపూజ, భజన, మంగళ హారతి, మాలా విసర్జన వరకు మండల దీక్షకు కావలసినవన్నీ ఒకే పుస్తకంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో దీనిని తయారు చేశాను.

📖 ఈ పుస్తకంలో ఏమున్నాయి?

1. అయ్యప్ప దీక్షా నియమాలు

  • దీక్షా సమయములో తప్పక పాటించవలసిన 29 నియమాలు
  • యాత్రా సమయములో పాటించవలసిన 10 ముఖ్య నియమాలు
  • శబరిమల పాదయాత్ర నినాదాలు (పిలుపు – ప్రతిస్పందన)
  • కన్నె స్వామి నుండి 18వ పడి వరకు స్వాములు మరియు వారి గుర్తులు

2. నిత్య ప్రార్థనలు

  • విఘ్నేశ్వర, గురు, కుమారస్వామి, అమ్మవారు, లక్ష్మీదేవి, సరస్వతి, అన్నపూర్ణ, విష్ణుమూర్తి, అయ్యప్ప, ఆంజనేయ ప్రార్థనలు
  • శ్రీ మృత్యుంజయ మహా మంత్రము
  • పదునెనిమిది మెట్ల స్తుతి

3. అయ్యప్ప స్వామి భజన పాటలు

  • శ్రీ అయ్యప్ప స్వామి శరణుఘోష (108 నామాలు, ప్రతి నామానికి అర్థంతో సహా)
  • హరివరాసనం, ఇరుముడికట్టు శబరిమలైక్కి, పల్లికట్టు శబరిమలైక్కి, మల్లెపూల పల్లకి, భగవాన్ శరణం భగవతి శరణం
  • చెట్టనక పుట్టనక, అంబరాన గరుడ పక్షులాడి, మాల ధారణం నియమాల తోరణం, పసడీ మెట్ల సృష్టి కర్త, బాల స్వామిని బంగారు అయ్యప్పా
  • ఇంకా మరెన్నో ప్రసిద్ధ అయ్యప్ప భజన పాటలు

4. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భజన పాటలు

  • సుబ్రహ్మణ్య స్వామి కీర్తన

5. శ్రీ శివ భజన పాటలు

  • బిల్వాష్టకం, లింగాష్టకం, శివాష్టకం, శివ పంచాక్షర స్తోత్రం
  • మహాప్రాణ దీపం, శివ శివ అంటూనే

6. శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్రాలు

  • శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, అచ్యుతాష్టకం

7. పూజా విధానం – మంగళ హారతి – దీక్షా సంకల్పం

  • గాయత్రి మంత్రం, నైవేద్యములు
  • ధూప, దీప, నైవేద్య మంత్రాలు, ఆత్మ ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారం, క్షమాపణ
  • అయ్యప్ప స్వామి మంగళ హారతి, మాలా విసర్జన మంత్రం
  • శ్రీ అయ్యప్ప దీక్షా సంకల్పం
  • సంకల్ప పట్టిక: అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం సులభంగా నింపుకునేందుకు

✨ ఈ పుస్తకం ప్రత్యేకతలు

  • పెద్ద తెలుగు అక్షరాలతో, భజనలో సులభంగా చదవగలిగేలా రెండు కాలమ్‌లలో అమర్చాం
  • ప్రతి పాటకు పేజీ నంబర్‌తో విషయ సూచిక ఉంది
  • పడిపూజ, ఇంటి పూజ, భజన కార్యక్రమాలకు ఒకే పుస్తకం సరిపోతుంది
  • ప్రింట్ చేసుకోవడానికి అనువుగా A4 సైజులో తయారు చేశాం
ఈ పుస్తకాన్ని క్రింది లింక్ ద్వారా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని మీ భజన బృందంతో పంచుకోండి. అయ్యప్ప దీక్ష యోజన – భజన పాటలు పుస్తకం

పుస్తకంలో ఏవైనా తప్పులు కనిపిస్తే లేదా మీ దగ్గర ఉన్న మంచి భజన పాటలను చేర్చాలనుకుంటే, దయచేసి కామెంట్‌లో తెలియజేయండి. తదుపరి ఎడిషన్‌లో సరిచేస్తాను.

సర్వేజన సుఖినోభవంతు 🙏 ఓం శాంతిః శాంతిః శాంతిః 🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏

Thursday, October 16, 2025

నాన్న అంటేనే ఇంతేనేమో

బహుశా... నాన్న అంటే ఇంతేనేమో..!

అమ్మ కొంగు పట్టుకుని తిరిగే చిన్ని నాన్న...
తన కూతురినే అమ్మలా చూసుకునే నాన్నగా ఎప్పుడు మారాడో..?

నాలుగు రూపాయలు ఇస్తే సినిమా చూసి వస్తా! అనే వాడు...
నాలుగు రూపాయలు దాచితే “పిల్లల భవిష్యత్తు చూస్తా!” అనేంత వాడిగా ఎలా మారాడో..?

తనకు బాలేనిది బడి అగొట్టి తిరిగే పిల్లవాడు...
తనకు బాలేనిది దాచి.. బాధ్యతల కోసం పరిగెత్తే పెద్దవాడిగా ఎప్పుడు మారాడో..?

ఆ అమ్మాయి వెంట అల్లరి చేస్తూ తిరిగే తుంటరి వాడు...
ఏ ఆపద పిల్లల దరిదాపులోకి రాకుండా కాపాడే సైనికుడిలా ఎప్పుడు మారాడో..?

గొంతు చించుకొని కొనిస్తావా? కొనియావా? అని పేచీ పెట్టే చంటి వాడు...
కడుపు కట్టుకుని పిల్లల కోసం రాజీ పడే ఇంటివాడిగా ఎలా మారాడో..?

బహుశా... నాన్న అంటే ఇంతేనేమో..!
కనిపించే ఉగ్రత..!
కనిపించని బాధ్యత..!! 

ఇది అర్థం కావాలంటే — ఒక్క నాన్న మాత్రమే కావాలి..!
తన ప్రేమ ఎప్పుడూ మాటల్లో ఉండదు, పనుల్లో మాత్రమే కనిపిస్తుంది.
కోపంగా కనిపించే ప్రతి నాన్న హృదయంలో పిల్లల కోసం వేల ఆందోళనలు,
వేల ఆశలు దాగి ఉంటాయి... 💙

-- శ్రీనివాస్ ఇరుకుళ్ళ

Tuesday, May 27, 2025

అర్ధాంగి అంటే అర్థం చేసుకునే మనసే..!

అలు మగలు మధ్య గొడవలు, టి కప్పులో తుపాన్ లాంటివి.. ఆ తుఫన్ మీ బంధాన్ని బలం చేసేది.
ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వల్లనే ఎక్కువ కొప్పుడతం, తనే నా అర్దాంగి. -- దీన్ని ఎక్కడో కాపీ చేసాను. 

మనిషి విలువ మరచిన ప్రపంచం..!

కళల ప్రపంచం కల్లోల ప్రపంచం కొగిట పడి నలుగుతుంది నేటి ప్రపంచం..!!


ప్రేమతో కూడిన అర్ధాంగి — జీవితపు నిజమైన ఆశీర్వాదం..!

అర్థం చేసుకునే అర్దాంగి మన తోడుంటే, కటిక దరిద్రంలో కూడా జీవితం అందంగా ఉంటుంది. మీరు ఏమంటారు.?

Sunday, February 16, 2020

నీ ఆత్మ నిశ్చలమైతే,

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥

పూలకు రంగులు ఉన్నవి కాని, పూజకు రంగులు ఉన్నాయా?
పూల వంటిదే నీ ఆత్మా
పూజ వంటిదే పరమాత్మ      ॥ నీ ఆత్మా ॥

ఆవుకు రంగులు ఉన్నవి కాని, పాలకు రంగులు ఉన్నాయా ?
ఆవువంటిదే నీ ఆత్మా,
పాల వంటిదే పరమాత్మ       ॥ నీ ఆత్మా ॥

ఏటికి వంపులు ఉన్నవి కాని, నీటికి వంపులు ఉన్నాయా ?
ఏటి వంటిది నీ ఆత్మా ,
నీటి వంటిదే పరమాత్మా       ॥ నీ ఆత్మా ॥

భజనకు రీతులు ఉన్నవి కానీ, భక్తి కి రీతులు ఉన్నాయా?
భజన్ వంటిదే నీ ఆత్మా
భక్తి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

చెరుకు కణతలు ఉన్నవి కానీ, తీపికి కణతలు ఉన్నాయా?
చెరుకు వంటిదే నీ ఆత్మా
తీపి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥



Tuesday, May 29, 2018

బంధాలన్ని పెరిగి భాద్యతలైనప్పుడే జీవితం ఒంటరిది


ఎంతో పెద్ద బలగం నా, నా బార్యామణి తరుపునా ఎందరో వున్నారు చుట్టాలు స్నేహితులు. 

ఇంటికి ఇంటికి, ఉరికి ఊరికి పెద్దదూరం ఏం కాదు, కప్పు కాఫీ తాగేసమయం లేకచంద్రుడు వెళ్ళి సుర్యాడువచ్చేసమయం, ఇళ్ళు విశాలం, ఊరు విశాలం, మనసు విశాలం కాని మనుషులకి మనషులకే ఇరుకు, మనషి జీవితం అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అనే అనదం ప్రేమ తప్ప ఏమి తెలియని కుటుంబం. 

ఆ ప్రేమ బంధాలన్ని పెరిగి భాద్యతలైనప్పుడు, అవి పంచుకోలేక వాటిని మోయలేక పడే నరకయాతనే నేన్ను ఒంటరి తనాన్ని దెగ్గర చేస్తుంది. 

ఒంటరితనం అంటే మనిషి లోని కోపం, చిరాకు, ఆవేశం, అనర్థం, అపార్థం, అభిప్రాయభేదం వల్ల వచ్చే గొడవలు నీలోని స్థిమితన్ని దూరం చేసి మతిస్తిమితాలుగా మార్చేస్తుంది, సున్నా కి విలువ లేదు, అదే సున్నా లేనిది రూపాయికి విలువలేదు, ప్రేమ లెక్క కూడా అంతే ఉదయం లేచిన దేగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు లెక్కలే జీవితం, ఇంకా ప్రేమ పంపకాలకి చోటెక్కడిది. 

రాత్రికి ఉదయానికి మధ్య తీరిక చేసుకొని ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకు పుడతామో.. ఎవరి కోసం బ్రతుకుతామో..తెలియక అందరు ఉన్నా..జీవితం ఒక్కోసారి ఒంటరిది అవుతుంది.