Saturday, May 12, 2012

ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో..


ఇదే జీవితం
ఒకే ఒక మాట:
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ..................

ప్రియతమా ప్రేమించకు ...

నీ ప్రేమకోసం నేను పడిన వేదన,

నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,

నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,

నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,

దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,

నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,

నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,

నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,

నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,

నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,

అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,

ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,

కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.

అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.

You love me...You love me not.....


గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,

నా మనసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి,

ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నాను,

నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను,

నీ అంగీకారం దొరకక,

పంజరంలో ఉన్న పావురంలా ఉంది నా ప్రేమ.!

బయటకి రావాలని నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది,

సరస్వతీ పుత్రికవైన నీకు,

నా చూపుల భాష తెలియటం లేదా..?

లేకపొతే ప్రేమలేక నీ మనసు శిలైపొయిందా.....?

Sunday, April 29, 2012


మనకు ఇష్టమైన  వాళ్ళకి  మనం నచ్చం....
మనమంటే ఇష్టమైన వాళ్ళు మనకు నచ్చరు....
మనకు ఇష్టమైన వాళ్ళు, మనమంటే ఇష్టపడే 
వాళ్ళు చాలా దూరంలో ఉంటారు....
మనకు  ఇష్టమైన  వాళ్ళు, మనమంటే ఇష్టపడే 
వాళ్ళు దగ్గరన్నా  అది చెప్పే  దైర్యం లేక  
దూరమైపోతారు....

Monday, April 23, 2012

vellavaa o vennelalaa

నీ వెళ్లి పోవా ఈ గుండె  నుంచి 
ఓ గత జ్ఞాపకమై ....
కన్నీటి ధారవై కారిపోవా 
ఎవరు లేని అనదల వుండి పోయాను...
ఈ కళ్ళ నుంచి ..
నువ్వే నిండిన ఈ హృదయం వేరెవారికీ  చోటే లేదని  అంటోంది 
నిద్దురలో  నిన్నే  కలలుకన్నా  నా నయనం,,
ఎవరిని చూసిన  నీవని చబుతోంది  
నీ వెళ్లి పోవా ఈ గుండె  నుంచి 
కన్నీటి ధారవై కారిపోవా  ఈ కళ్ళ నుంచి ..
ఇన్నాళ్లు  నిన్నే తలచి పిలచిన  ఈ పెదవే 
నేడు మాటలు  రాక మూగది  అయిపోతోందే
నువ్వే  లేవని తెలిశాక 
నువ్వే  రావని చెప్పక .,
నా మనసే  నా మాట విననని అంటోంది
నా గుండెను శిలను చేసి 
నా మనసును ఎడారిని చేసి
వెళ్ళావా.. ఓ వెన్నెలలా ఓ వసంతంలా...



Friday, April 20, 2012

Maruvani jnapakam

ఓ కమ్మని కలలా ....!
కలకాలం నిలిచే ఓ మధుర  జ్ఞాపకం లా
అనిపించింది తను,  కానీ ...!
నా హృదయపు అంతరాల్లో నుంచి 
నా మనసు  పొరలలోంచి   ..! 
వెళ్లి పోయింది.  తను నిశ్శబ్దంగా
తన దారి తను వెతుక్కునేందుకు 
తన గమ్యం తను తెలుసుకొనెందుకు,     
ఆత్మీయుడు అను  కున్న నన్నే  విస్మరించి...!   
తన నిలయము ఆనుకున్న  నా హృదయమునకే  చెప్పుట  మరచి
వెళ్ళింది.  తను  నిర్మలంగా ... నిశ్శబ్దంగా 
నా జీవితపు  పుస్తకం లో  ఓ  ఆధ్యాయంలా నిలిచి, 
ఓ   జీవిత   పాఠం నాకు  నేర్పింది .
ఎవరికి ఎవరు  ఈ లోకంలో  ఎవరికి ఎరుక  అంటూ  ఓ తత్వం బోదించి 
వెళ్లి పోయింది నిశ్శబ్దంగా ... నిర్మలంగా
నా  జీవితంలో  ఓ ఎండమావిల...
ఓ వెన్నెల  లా ....!


Thursday, April 12, 2012

 Hi Friends Now I am update in drupal-7.12
drupal is a good ADMIN side web development software
this chapter is very interesting....!

I love drupal..!

Drupal is an open source content management
 platform powering millions of websites
and applications. It’s built, used, and
supported by an active and diverse community
of people around the world.