Tuesday, July 24, 2012

టావో సిద్ధాంతం.

పోయినవాళ్లు పోతే మిగిలిన వాళ్లకే దుఃఖం. మిగిలినవారికి ఇది ఒకరకంగా దుఃఖించడానికి కారణమయితే, సంతోషించడానికి కూడా ఇదే కారణమంటుంది టావో సిద్ధాంతం. తమవాళ్లు పోతే ఆబాధకు గురికానవసరం లేకుండా, పోయినవాళ్లు సుఖపడ్డారని భావం. మనవారికి అలాంటి అవకాశం దొరకడం మనకు సంతోషకరమే గదా.

టావో పండితుడొకాయన గురించి కథ ఒకటి చెబుతారు. ఆయనగారి భార్య పోయింది. బంధువులు, మిత్రులూ సంతాపం తెలియజేయడానికని వచ్చారు. పండితుడు మాత్రం హాయిగా పాడుతూ మద్దెల వాయిస్తున్నాడట.

“ఏమిటిది? ఇన్ని సంవత్సరాలు నీతో బతికిన నీ భార్య పోతే, నీవు సంతోషంగా పాడుతున్నావేమిటి?” అడిగారు బంధువులు. దానికాయనగారి జవాబు “నాకు భార్యంటే అమితమైన ప్రేమ. తను పోతే ముందు నాకు బాధే కలిగింది. కానీ ఆలోచించిన మీదట జీవితమంటే ఇంతేననిపించింది. అయితే తనకంటే ముందు నేనే పోతే ఏమయ్యుండేది. ఆవిడకు దుఃఖం. మళ్లీ పెళ్లి. ఏమో ఎలాంటివాడు దొరుకుతాడో? నా పిల్లల గతి ఏమయ్యుండేదో?”

“కన్నీళ్లు జీవితగతులను మార్చలేవు. ఇప్పుడు నా భార్య ప్రశాంతంగా ఉంది. నేను ఎడిచి పెడబొబ్బలు పెట్టి అల్లరి చేయడం భావ్యం కాదు. నేనే గనుక అలా చేస్తే నాకు జీవితం గురించి మరణం గురించి అర్థం కానట్లే గదా!”

Monday, June 25, 2012

నీవు  వోడిపోతే  లోకం అంతా గెలవడని  కి 100 మార్గాలను చేప్తుంది ....!
కానీ లోకం  వోడిపోతే   దానికి  100 కారణాలు చేప్తుంది.....!!
 ఈ మనుషులు ఇంతే
నిన్ను  చూసి  మొరిగే ప్రతి కుక్క దెగ్గర  నివు
ఆగి రాళ్లు విసరాల్సిన  అవసరం లేదు
అలా  చేస్తూ  వేళ్తే నీ గమ్యం నీవు చేరలేవు ......!
 

Tuesday, June 19, 2012

I Am Buying Bike

హాయ్ ఫ్రెండ్స్ నేను బైక్  కొనలి  ఆనుకున్నను.
కానీ  అది ఎం  బైక్ కొనాలో  ఆలోచిస్తున్నాను .
నాకు Bajaj Pulsar 135 మరియు Yamaha fz s
మీద వుంది.  నాకు యది బగుంటుందో  మీరు చెప్పండి .....?

Saturday, May 19, 2012

నా నల్లగొండ పర్యటన

హాయ్  ఫ్రెండ్స్  హ్మం  16-05-12 నా  నేను  నల్లగొండ  వెళ్ళాను.
నేను వెళ్ళింది న  డ్రైవింగ్  లైసెన్సు  పనిమీద   కానీ అక్కడ  గబ్బర్ సింగ్  మూవీ  
చూసాను  మూవీ చాలా  బాగుంది . అక్కడ త్రాగే  నిల్లు మాత్రం  చాడా 
చండలం గా వున్నవి .  అక్కడ వాళ్ళు  ఎలా త్రాగుతున్నారో  ఏంటో ...
నేను ఒక రోజు  త్రాగి నొందుకే  న గొంతు  పోయింది....!
అక్కడికి  వల్లడం  Train లో వెళ్ళాను .  కానీ  రావడం బస్సు  లో వచ్చాను.
ఆలా సింగిల్  గ వెళ్లి  రావడం లో  కూడా ఎంజాయ్ వుంది .

మల్లి  వెళ్ళాలని  వుంది . అలా సోలో  గా...!
ఎంత దూరమైన  ఎక్కడికేనా....!
ఎందోకో  ఏమో  ఆ ఆనందం చప్పలేను 
అలా ఎంజాయ్ చేస్తా తలుస్తుంది .....!
 

Saturday, May 12, 2012

ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో..


ఇదే జీవితం
ఒకే ఒక మాట:
మనసులోని భావాలెన్నో
మరువలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని బంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో
కవ్వించే కబుర్లెన్నో
మాయమయ్యే మార్పులెన్నో
అవసరానికి ఆడిన అబద్ధాలెన్నో
తుంటరిగా చేసిన చిలిపి పనులెన్నో
ఆస్చర్యపరిచే అద్భుతాలెన్నో
మాటల్లో చెప్పలేని ముచ్చట్లెన్నో
ముసుగు వేసిన మనసుకు మరువరాని జ్ఞాపకాలెన్నో
ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో...
మనిషి జీవితంలో మరువలేని ఇంకెన్నో
ఇదే జీవితం... దీనిని అనుభవించు అనుక్షణం ..................

ప్రియతమా ప్రేమించకు ...

నీ ప్రేమకోసం నేను పడిన వేదన,

నా ప్రేమను నీకు వ్యక్తం చెయ్యాలన్న ఆవేదన,

నీకోసం జారే ప్రతి కన్నీటిబొట్టు చూసినప్పుడు కనిపిస్తుంది,నా మదిలొని నీ ప్రేమ,

నీ కోసం కన్నీళ్ళు పెడుతున్నా ఆనందంగా ఉంటుంది,

దూరమైన నీకోసం చూసే ఎదురుచూపులోను ఆనందమే,

నీవు చెంతనున్నా ఇంత ప్రేమ కనిపించదేమో,

నీ ప్రేమ పొందాలని పడే ఆరాటం,

నిన్ను చేరువవ్వాలన్న ఆకంక్షా,

నీతో సమయాన్ని గడపాలన్న ఆలోచనలు,

నీ ప్రేమ దొరకకముందున్న నాప్రేమ అనంతం,

అసలు ప్రేమలో కాదు ఎదురుచూడటంలోనే ఆనందముంది,

ప్రేమ దోరకముందు ప్రేమ కనిపిస్తుంది,

కాని ప్రేమ దొరికిన తర్వాతా ప్రేమ మాయమవుతుంది,భాధ్యత ప్రారంభమవుతుంది.

అందుకే నన్ను ప్రేమించకు ప్రియతమా.