Sunday, February 19, 2017

ఎందుకో ఏమో.... !

నేను ఎదురు చూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఎందుకో అప్పటి వరకు అందంగా ఉన్న నా మనసు ఇంతలోనే బరువెక్కింది, కంట్లో నీరు మొదలయింది. ఎందుకు నాకు ఎం అర్థం కావడం లేదు....
ఇన్ని రోజులు ఉన్న నా ఆనందం దూరమవుతుందా అన్న బాధ..
అది నేను పెళ్లి పీటల మీద తాళి కట్టే ముందు..
నాకే ఇలా అనిపించిందా లేక అందరికి ఇలానే ఉంటుందా.?


Wednesday, February 15, 2017

Monday, February 13, 2017

ఓమ్ మహా ప్రాణ దీపమ్ శివమ్ శివమ్
మహోంకార రూపమ్ శివమ్ శివమ్
మహా సూర్య చంద్రాగ్ని నేత్రమ్ పవిత్రమ్
మహా గాఢ తిమిరాంతకమ్ సౌరగాత్రమ్
మహాకాంతి బీజమ్ - మహా దివ్య తేజమ్
భవానీ సమేతమ్ - భజే మంజునాధమ్
ఓమ్ నమశ్శంకరాయచ -మయస్కరాయచ
నమశ్శివాయచ -శివతరాయచ - భవయరాయచ
మహ ప్రాణదీపమ్ - శివమ్, శివమ్
భజే మంజునాధమ్ - శివమ్, శివమ్
అద్వైత భాస్కరమ్ - అర్దనారీశ్వరమ్
త్రిదశ హృదయంగమమ్    -చతురుదధి సంగమమ్
పంచభూతాత్మకమ్ - షట్చత్రునాశకమ్
సప్తస్వరేశ్వరమ్    - అష్టసిద్దీశ్వరమ్
నవరస మనోహరమ్ - దశదిశా సువిమలమ్
ఏకాదశోజ్జ్వలమ్ - ఏకనాథేశ్వరమ్
ప్రస్తుతి వశంకరమ్ -ప్రణత జనకింకరం
దుర్జన భయంకరమ్ -సజ్జన శుభంకరమ్
ప్రాణిభవతారకమ్ - ప్రకృతి హిత కారకమ్
భువన భష్యభవనాయకమ్ -భాగ్యాత్మకమ్ రక్షకమ్
ఈశమ్ సురేశమ్ - వృషేశమ్ పరేశమ్
నటేశమ్ గౌరీశమ్ - గణేశమ్ భూతేశమ్
మహామధుర పంచాక్షరీ మీ మంత్ర మార్షమ్
మహాహర్ష వర్ష ప్రవర్షమ్ సుశీర్షమ్
ఓమ్ నమోహరాయచ స్వరహరాయచ పురహరాయచ
రుద్రాయచ భద్రాయచ ఇంద్రాయచ
నిత్యాయచ నిర్ణిద్రాయచ
మహ ప్రాణదీపమ్-శివమ్, శివమ్
భజేమంజునాధమ్-శివమ్, శివమ్
ఢంఢంఢ  ఢంఢంఢ  ఢంఢంఢ  ఢంఢంఢ
ఢక్కా నినాద నవతాండవాడంబరమ్
తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి
సంగీత సాహిత్య సుమకమల బంభరమ్
ఓంకార హ్రీంకార శ్రీంకార హైంకార
మంత్ర బీజాక్షరమ్ మంజునాధేశ్వరమ్
ఋగ్వేద మాద్యమ్ -యజుర్వేదవేద్యమ్
సామప్రగీతమ్ - అధర్వ ప్రభాతమ్
పురాణేతిహాస ప్రసిద్దమ్ విశుద్దమ్
ప్రపంచైక సూత్రమ్ - విబుద్ధమ్ సుసిద్ధమ్
నకారమ్ మకారమ్ - శికారమ్ వకారమ్
యకారమ్ నిరాకార సాకార సారమ్
మహాకాల కాలమ్ మహానీల కంఠమ్ - మహనంద
నందమ్ మహట్టాట్ట హాసమ్
జటాజూట రంగైక గంగా సుచిత్రమ్
జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రమ్ సుగోత్రమ్
మహాకాశ భాస్వన్మహాభానులింగమ్
మహాబభ్రు వర్ణమ్ సువర్ణమ్ ప్రవర్ణమ్
సౌరాష్ట్ర సుందరమ్ - సోమనాథేశ్వరమ్
శ్రీశైల మందిరమ్ - శ్రీమల్లికార్జునమ్
ఉజ్జయిని పుర - మహాకాళేశ్వరమ్
వైధ్యనాధేశ్వరమ్ -మహాభీమేశ్వరమ్
అమరలింగేశ్వరమ్ రామలింగేశ్వరమ్ -కాశీవిశ్వేశ్వరమ్
పరమ్ ఘృశ్మేశ్మరమ్
త్ర్యయంబకాధీశ్వరమ్ - నాగలింగేశ్వరమ్
శ్రీ కే్దారలింగేశ్వరమ్
అప్లింగాత్మకమ్ - జ్యోతిలింగాత్మకమ్
అఖిల లింగాత్మకమ్ - అగ్ని సొమాత్మకమ్
అనాదిమ్ అమేయమ్ అజేయమ్ అచింత్యమ్
అమోఘమ్ అపూర్వమ్ అనంతమ్ అఖండమ్ // అనాదిమ్ //
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ఓమ్ సోమాయచ - సౌమ్యాయచ
భవ్యాయచ - భాగ్యాయచ
శాంతాయచ - శౌర్యాయచ
యోగాయచ - భోగాయచ
కాలాయచ - కాంతాయచ
రమ్యాయచ - గమ్యాయచ
ఈశాయచ - శ్రీ చాయాయచ
శర్వాయచ - సర్వాయచ  

Sunday, February 5, 2017