Sunday, February 16, 2020

నీ ఆత్మ నిశ్చలమైతే,

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥

పూలకు రంగులు ఉన్నవి కాని, పూజకు రంగులు ఉన్నాయా?
పూల వంటిదే నీ ఆత్మా
పూజ వంటిదే పరమాత్మ      ॥ నీ ఆత్మా ॥

ఆవుకు రంగులు ఉన్నవి కాని, పాలకు రంగులు ఉన్నాయా ?
ఆవువంటిదే నీ ఆత్మా,
పాల వంటిదే పరమాత్మ       ॥ నీ ఆత్మా ॥

ఏటికి వంపులు ఉన్నవి కాని, నీటికి వంపులు ఉన్నాయా ?
ఏటి వంటిది నీ ఆత్మా ,
నీటి వంటిదే పరమాత్మా       ॥ నీ ఆత్మా ॥

భజనకు రీతులు ఉన్నవి కానీ, భక్తి కి రీతులు ఉన్నాయా?
భజన్ వంటిదే నీ ఆత్మా
భక్తి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

చెరుకు కణతలు ఉన్నవి కానీ, తీపికి కణతలు ఉన్నాయా?
చెరుకు వంటిదే నీ ఆత్మా
తీపి వంటిదే పరమాత్మ         ॥ నీ ఆత్మా ॥

నీ ఆత్మ నిశ్చలమైతే,
పరమాత్మ నిశ్చలమౌను      ॥ నీ ఆత్మా ॥