Thursday, November 8, 2012
Friday, October 12, 2012
This is My Home Photos
హాయ్ ఫ్రెండ్స్ మై ఇల్లు ఫొటోస్
https://plus.google.com/photos/102739170359506972934/albums/5792329583229621073?authkey=CPSMupPwudvxdw
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Tuesday, October 9, 2012
నమ్మకం
జ్ఞానం, ధనం, శక్తి, శ్రమ మరియు నమ్మకం అందరూ మంచిమిత్రులు.....
కలిసి ఆనందంగా ఉందామనుకున్నారు కానీ కాలం కలసిరాక విడిపోవలసి వచ్చింది....
ఎవరు ఎక్కడికి వెళ్ళి ఉండాలో అని చర్చించుకుంటూ.....
జ్ఞానం:- నేను విద్యాలయాల్లో, మందిరాల్లో, మసీదు, చర్చి, గురుద్వార్ లాంటి చోట్ల తలదాచుకుని నా దరిచేరిన వారికి నేను తగిన విధంగా దక్కుతానంది.
ధనం:- నేను మహల్లో, ఆస్తిపరుల ఖజానాల్లో దాకుంటానని చెప్పింది.
శక్తి:-ఆరోగ్యం మరియు సమతుల్యమైన ఆహారాన్ని నేను ఆశ్రయిస్తానన్నది.
శ్రమ:- సోమరితనంవీడి పట్టుదలతో సాధించాలని అనుకునే వారి దగ్గర వారాలు గడిపేస్తూ బ్రతుకుతానన్నది.
నమ్మకం మాత్రం మౌనంగా శూన్యంలోకి చూస్తుంటే జ్ఞానం మరియు ధనం అదేం నీవు ఎక్కడికి వెళతావో చెప్పవేం అనడిగిన దానికి ఒక ధీర్ఘశ్వాస తీసుకుని నిదానంగా ఇలా అన్నది........
"నేను ఒక్కసారి వెళ్ళిపోయానంటే ఇంక తిరిగిరాను".
వీరిచే పోస్ట్ చెయ్యబడింది
sreenivas erukulla
Thursday, October 4, 2012
Friday, August 31, 2012
Love is beautiful
హాయ్ ఫ్రెండ్స్ జీవితం చాల చిన్నది అనుకుంటాను. వెన్ని ని మరచిపోవాలంటే కష్టం గ వుండేది
ఒక్కపుడు. కాని చాల కాలం తరువాతా మళ్ళి నా లైఫే లోకి మరో కొత్త అమ్మాయి వచ్చింది .
తనని చూడగానే అనిపించిది.
తనతో వుండాలి అని తనతో మాట్లాడాలి అని వుండేది .
తను నాకు చాలా రోజులనుండి తెలుసు కానీ తను 2 months back నాతో మాట్లాడింది .
ఆరోజు నుండి ప్రతి రోజు నాతో మాట్లాడుతుంది .
తన పేరు సమయం వచిన్నపుడు చెప్తాను.
కానీ తను నాతో మాట్లాడుతుంటే నాకు మంచి మ్యూజిక్ విన్తున్నాటు గా వుంటుంది .
అంతా హ్యాపీ గా వుంటుంది.
so i miss you that girl
ఎందుకంటే రోజు అంతా తనని చుదలేనుకాధ ... -:)

Tuesday, July 24, 2012
అందరూ సమానులే
అనగనగా ఒక ముసలాడు. ఆకలితో నకనకలాడుతున్నాడు. అందుకనే ఒకకోడిని దొంగిలించుకొచ్చాడు. రహస్యంగా ఇంటికి వచ్చి కోడిని కాల్చుకుంటున్నాడు. ఇంతలో ఎవరో ఇంటి తలుపు తట్టారు.
తన దొంగతనం బయట పడిపోయిందేమోనని భయపడిపోయాడు ముసలతను. అందుకనే తలుపు తీయకుండా కూచున్నాడు. వచ్చినతనెవరో తలుపు దబదబా కొడుతూనే ఉన్నాడు.
“ఎవరు వచ్చిందీ? ఏం కావాలి?” విసిగి వేసారి, కూచున్న చోటినుంచే కేక వేశాడు ముసలాయన.
“నేను దేవుడిని. చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమయినా కావాలి!” జవాబు వచ్చింది.
“అయ్యో! నా దగ్గర నీకు పెట్టడానికి ఏమీ లేదు!” అన్నాడు వద్ధుడు.
“అబద్ధాలాడుతున్నావు. వాసన ఇక్కడి దాకా వస్తున్నది! నాకు తిండి పెడితే నీకు కోరిన వరాలిస్తాను!” అన్నాడు దేవుడు.
“నాకే వరమూ అక్కరలేదు. వెళ్ల”మన్నాడు ముసలతను.
“సరే! నాకెందుకు తిండి పెట్టగూడదనుకుంటున్నావ్?” ప్రశ్నించాడు దేవుడు.
“నువ్వు నన్ను బీదవాణ్ణి చేశావు. యింకొకరిని ధనవంతుడిగా చేశావు. నీకు పక్షపాతం ఎక్కువ! అందరినీ సమానంగా చూడలేని వారికి నేను తిండి పెట్టను! అది నా నియమం!” జవాబిచ్చాడు ముసలతను.
“నీవన్నది అక్షరాలా నిజం!” దేవుడు వెళ్లిపోయాడు.
కాసేపు తర్వాత మళ్లీ తలుపు తట్టిన చప్పుడు. ఈసారి వచ్చింది పవిత్రమాత.
“ఎవరదీ?” అన్నాడు వృద్ధుడు.
“నేను దైవమాతను. నాకు తినడానికేమయినా కావాలి.” జవాబు.
“నేను నీకేమీ యివ్వదలుచుకోలేదు. వెళ్లు తల్లీ!” అన్నాడతను.
“ఎందుకు?” ప్రశ్నించిందామె.
“నీవూ ఆ దేవుడి లాంటి దానివే! సమానదృష్టి లేనిదానివి!”
జవాబు విన్న దైవమాత మారు మాటాడకుండా వెళ్లిపోయింది.
ఈలోగా వంట పూర్తయింది. ముసలాయన తినడానికి సిద్ధంగా కూచున్నాడు. మళ్లీ తలుపు తట్టిన చప్పుడు. “ఈసారి ఎవరయి ఉంటారో?” అనుకున్నాడు వృద్ధుడు. తలుపు దగ్గర నిలుచుంది మృత్యుదేవత.
“కోడివాసన భలేగా వస్తోంది1 నీక్కాస్త సాయం పడదామని వచ్చాను!”
“ఓహ్! నువ్వా! రా లోపలికి. అన్నట్లు, నీ దృష్టిలో అందరూ సమానులే గదా?” అన్నాడు వృద్ధుడు.
“అవును. నాకెవరిపట్లా అభిమానం లేదు. దరిద్రుడూ, ధనవంతుడూ, పిన్నవాడూ, పెద్దవాడూ, రోగిష్టీ, ఆరోగ్యవంతుడూ, నాకందరూ ఒకేలా కనిపిస్తారు.” అంది మృత్యువు.
“నాకు తెలుసు. అందుకనే నిన్ను లోపలికి రమ్మన్నాను. రా! భోజనం చేద్దాం!” సంతోషంగా ఆహ్వానించాడు ముసలాయన.
వాళ్లిద్దరూ కలిసి హాయిగా విందారగించారు.

Subscribe to:
Comments (Atom)