Tuesday, December 11, 2012

తన పరిచయం తో నా సహనం ఏంటో నాకు తేలిసింది .

నీకు ఏది అవసరం అనే విషయన్ని నువ్వు ఎప్పుడైనా అలోచించి సరైన నిర్ణయం తీసుకుంటావా ..
చిన్నప్పుడు అమ్మ నాన్న .. నీకు ఇది మంచిది అది మంచిది అని చెప్తే .. ఇష్టం తో వింటావ్ ..
కొంచెం పెద్దయ్యాక చెప్తుంటే .. ఇష్టం లేకపోయినా వింటావ్ ..
ఇప్పుడు .. వాళ్ళే చెప్పరు .. ఎందుకు .. నీకు ఏది మంచిదో నీకే తెలుసు అనే అభిప్రాయం లో వాళ్ళు ఉంటారు కాబట్టి ..
కాని నీకు నిజంగా తెలుసా .. ఉహు తెలీదు ..
పోనీ నీ చుట్టు పక్కన ఉన్న వాళ్ళు అది నీకు తెలియజేసేలాగా ఉంటారా .. లేదు
ప్రతి వారు .. వాళ్లకేది కావాలో తెలుసుకుని నిన్ను వాడుకుంటారు ...
నీకు నువ్వు ఉపయోగపడే కంటే .. వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతు ఉంటావు ..

నీకు ఒక ఫ్రెండ్ అంటే ఇష్టం .. ఆ ఫ్రెండ్ కి కూడా నువ్వంటే ఇష్టమే ..
ఒక నెల పోయాకా నీకు ఆ ఫ్రెండ్ అంటే ఇష్టమే .. కాని ఆ ఫ్రెండ్ కి నీకంటే ఇంకో ఫ్రెండ్ అంటే ఇష్టం ..
ఇది తెలియని నువ్వు పాపం మంచిగా ఉంటూ .. నీ ఫ్రెండ్ కూడా మంచిగా ఉండాలని ఆసిస్తావ్ ..
కాని పాపం ఇష్టం లేని చోట ఇష్టం చూపించడం నీ ఫ్రెండ్ కి ఎంత కష్టం ..
అక్కడ నీకు రిజెక్షన్ ఎదురవుతుంది .. పోనీ నీ ఫ్రెండ్ ఏ కదా .. వదిలేద్దాం అనుకుంటావ  ..
లేదు .. నువ్వు నాతొ ఎందుకు మాటాడడం  లేదు .. ఏమయింది .. అని రకరకాలా ప్రశ్నలు వేసి .. తెగేదాక లాగుతావు ..
అలా చెయ్యకుండా .. ఆ విషయాన్నీ అక్కడితో వదిలేసి .. నీ పని నువ్వు చూసుకుంటే .. నీ ఫ్రెండ్ రియలైజ్ అయితే తనే తిరిగి వస్తుంది ..
లేదు .. నీ ఫ్రెండ్ అయ్యే అర్హత లేదు .. సో అక్కడితో ఆ విషయం ఆగిపోతుంది ..
నీకు కూడా .. వాళ్ళని అడిగి .. నువ్వు బాధపడి .. నీ మనసు పాడు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ..

మనిషి మనసు పరి పరి విధాలు ..
అన్ని చోట్ల అందరి మనస్తత్వాలు కలుస్తాయి కలవాలి అని రూల్ ఏమి లేదు ..
సో ఎక్కడైనా .. ఓపిక గా ఉండడం కంటే ఉత్తమం ఇంకేమి లేదు ..
నీకు ఇష్టం లేదా .. కాసేపు ఓపికగా .. మౌనం గా ఉండు ..
నీకు బాధగా ఉందా .. ఓపికా మౌనం ..
నీకు కోపం గా ఉందా సేమ్ అదే చేయి
నీకు కావలసింది మిస్ అయిపోయినా కూడా అంతే ..
లేని వాటి కోసం బాధ పడి మనసు పాడు చేసుకుంటే .. ఉన్నదాంట్లో కూడా నీకు ఆనందం ఉండదు ..

అందుకే ఏమో అమ్మ ఎప్పుడు చెప్తుంది దేంట్లో అయిన సహనం ఓర్పు ఓరిమి ఉండాలి అని :)

0 వ్యాఖ్యలు:

Post a Comment