Tuesday, May 29, 2018

బంధాలన్ని పెరిగి భాద్యతలైనప్పుడే జీవితం ఒంటరిది


ఎంతో పెద్ద బలగం నా, నా బార్యామణి తరుపునా ఎందరో వున్నారు చుట్టాలు స్నేహితులు. ఇంటికి ఇంటికి, ఉరికి ఊరికి పెద్దదూరం ఏం కాదు, కప్పు కాఫీ తాగేసమయం లేకచంద్రుడు వెళ్ళి సుర్యాడువచ్చేసమయం, ఇళ్ళు విశాలం, ఊరు విశాలం, మనసు విశాలం కాని మనుషులకి మనషులకే ఇరుకు, మనషి జీవితం అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అనే అనదం ప్రేమ తప్ప ఏమి తెలియని కుటుంబం. ఆ ప్రేమ బంధాలన్ని పెరిగి భాద్యతలైనప్పుడు, అవి పంచుకోలేక వాటిని మోయలేక పడే నరకయాతనే నేన్ను ఒంటరి తనాన్ని దెగ్గర చేస్తుంది. ఒంటరితనం అంటే మనిషి లోని కోపం, చిరాకు, ఆవేశం, అనర్థం, అపార్థం, అభిప్రాయభేదం వల్ల వచ్చే గొడవలు నీలోని స్థిమితన్ని దూరం చేసి మతిస్తిమితాలుగా మార్చేస్తుంది, సున్నా కి వెలువ లేదు, అదే సున్నా లేనిది రూపాయికి విలువలేదు, ప్రేమ లెక్క కూడా అంతే ఉదయం లేచిన దేగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు లెక్కలే జీవితం, ఇంకా ప్రేమ పంపకాలకి చోటెక్కడిది. రాత్రికి ఉదయానికి మధ్య తీరిక చేసుకొని ఆలోచిస్తే తెలుస్తుంది. ఎందుకు పుడతామో.. ఎవరి కోసం బ్రతుకుతామో..తెలియక అందరు ఉన్నా..జీవితం ఒక్కోసారి ఒంటరిది అవుతుంది.

0 వ్యాఖ్యలు:

Post a Comment