Monday, January 21, 2013

ప్రేమంటే నా మనసులోని మాట

తనని  గుండెల్లో పెట్టుకొని  పూజిస్తాం . తనతో ఓ నిమిషం మాట్లాడిన ,
తానుగా వచ్చి  మన్ని  పలకరించిన  మన జన్మ ధన్యం అనుకుంటాం .

తను తిని పారేసిన  చాక్లెట్  కాగితాన్ని  తను వాడి పరెసీన రిఫిల్  గొట్టాని ,
తను తాకిన ప్రతి వస్తువుని .. పరవశంగా  తీసుకొని పవిత్రంగా దాచుకుంటాం .

తనని, తనకు చెంది అన్నిటిని .. తనను ప్రేమించినంతగా  ప్రేమిస్తాం ..
ఈదంతా ప్రేమేనా ....?

తననే చూస్తూ  తన వెంటే వెళ్తూ  తన కోసం  ఎం చేయడానికేనా ముందుంటు
ఎ నిమిశంలోనేన  మన ప్రేమకి తల వంచే తన చూపు కోసం ప్రతి నిమిషం  ఎదురుచూస్తూ  వుంటాం.
ఆ  నిమిషం  వచ్చాక ....

మన ప్రేమ కి తను అంగీకారం తెలిపాక ... తను ఇక మన సొంతమవుతుంది .
మన పెన్ను లా  పేపర్  లా మన షూ లాగా ..!

ఇంకా  తన వెంట తిరగాల్సిన ఆవసరం వుండదు మనకి .
తననే  అక్కడికో  ఇక్కడికో  రమంట్టం .. తను గల  గాలా నవ్వితే
ఆది  తన ఫ్రెండ్స్  తోనేనా... ఎందుకు  ఇలా  నవ్వావు  అని కారణం ఆడుగుతం ..
తను య నిమిషం ఎటు  వెళ్ళిన ఎం  చేసిన తన  టైం టేబుల్  మనకి ముందుగానే కావాలి .

కొన్ని  రోజుల  క్రితం  మనం ఎవరో  తలియాడు తనకి .
కానీ మన ప్రేమను  అంగికరించినందుకు.,.....

ఇప్పుడు  తను,, తనదనుకున్న దంతా  మన ఆడినం లో వుండాలి .
తన  స్వేచ్చని  మన చేతుల్లో పెట్టాలి . మన అంశాల్ని  మనస్పూర్తిగా పాటించాలి ..
ఇదేనా ప్రేమంటే ....??

నేస్తం ప్రేమంటే  పారేసిన చాక్లెట్ కాగితాన్ని దాచుకోవడం కాదు ..
నెచ్చెలి  గుణగణాల్ని ఏరుకోవడం , అందులో  లోపాల్ని దాచుకోవడం .

ప్రేమంటే  వెంట  తిరగడం కాదు....
జివితాంతం  తోడు వుండటం ....!!

  

0 వ్యాఖ్యలు:

Post a Comment